నగరాన్ని ముంచెత్తిన వాన

రాష్ట్ర రాజధానిలో బుధవారం స్వల్ప వ్యవధిలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో వరుణుడు విజృంభించాడు. గంట వ్యవధిలోనే నాంపల్లిలో 8.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Published : 06 Jun 2024 04:53 IST

ఖైరతాబాద్‌ కేసీపీ కూడలిలో నిలిచిన వాన నీటి తరలింపునకు శ్రమిస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో బుధవారం స్వల్ప వ్యవధిలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో వరుణుడు విజృంభించాడు. గంట వ్యవధిలోనే నాంపల్లిలో 8.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైటెక్‌ సిటీ పరిసరాల్లో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. భూగర్భ పైపులైన్లలోని వరద రోడ్లపైకి పెల్లుబికింది. అనేక ద్విచక్రవాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాలి లోతు నీరు ప్రవహించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు