ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి: మంత్రి పొన్నం

ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి.. చెట్లుగా పెంచే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు.

Updated : 06 Jun 2024 05:47 IST

తన నివాసం ఆవరణలో మొక్క నాటుతున్న మంత్రి పొన్నం  

హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి.. చెట్లుగా పెంచే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస గృహసముదాయంలోని తన నివాస ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే తరం, పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా.. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలన్నా.. ప్రతి రోజూ మొక్కలకు నీళ్లు పోసే విధంగా పిల్లలకు అలవాటు చేయాలన్నారు. మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే.. పర్యావరణం మనల్ని రక్షిస్తుందన్నారు. ఇప్పటికే కాలుష్యంతో పలువురు క్యాన్సర్‌ బారిన పడుతున్నారని.. మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి కాలుష్యరహితంగా తీర్చిదిద్దుకోవడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని