శేషుమాధవ్‌కు ‘నాస్‌’ అత్యుత్తమ పురస్కారం

మూడు దశాబ్దాలుగా వరి, పొగాకు పంటలపై పరిశోధనలు చేస్తున్న కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ డైరెక్టర్, వ్యవసాయ శాస్త్రవేత్త మాగంటి శేషుమాధవ్‌ (52)కు జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ - నాస్‌) అత్యున్నత పురస్కారం లభించింది.

Published : 06 Jun 2024 05:06 IST

హిమాంశుపాఠక్‌ నుంచి పురస్కారాన్ని స్వీకరిస్తున్న మాగంటి శేషుమాధవ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: మూడు దశాబ్దాలుగా వరి, పొగాకు పంటలపై పరిశోధనలు చేస్తున్న కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ డైరెక్టర్, వ్యవసాయ శాస్త్రవేత్త మాగంటి శేషుమాధవ్‌ (52)కు జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ - నాస్‌) అత్యున్నత పురస్కారం లభించింది. బుధవారం దిల్లీలో జరిగిన ఎన్‌ఏఏఎస్‌ వ్యవస్థాపక దినోత్సవంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్‌ జనరల్‌ హిమాంశుపాఠక్‌ దీనిని శేషుమాధవ్‌కు ప్రదానం చేశారు. హనుమకొండకు చెందిన శేషుమాధవ్‌ దిల్లీలోని వ్యవసాయ పరిశోధన సంస్థలో పీహెచ్‌డీ చేసిన అనంతరం అమెరికాలోని ఒహాయో స్టేట్‌ వర్సిటీలో మాలిక్యులర్‌ బయాలజీ, బయోటెక్నాలజీలో పోస్ట్‌డాక్టరేట్‌ పొందారు. అంతర్జాతీయ వ్యవసాయ జర్నల్స్‌లో 178 పరిశోధన వ్యాసాలు రాశారు. ప్రస్తుత భారత వ్యవసాయ పరిశోధనమండలిలో పాలకవర్గ సభ్యులుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని