గ్రూప్‌-1లో దివ్యాంగులకు రిజర్వేషన్‌లపై వివరణివ్వండి

గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్‌ల అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 07 Jun 2024 04:28 IST

ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం 

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్‌ల అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని నియామకాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌లు అమలు చేయాలని ప్రభుత్వం జారీ చేయగా, దానికి విరుద్ధంగా గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్‌లో వర్టికల్‌ రిజర్వేషన్‌లు వర్తింపజేయడాన్ని సవాలు చేస్తూ మెదక్‌ జిల్లాకు చెందిన ఎం.అర్జున్, కె.అరుణ్‌రెడ్డిలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు ఇది విరుద్ధమని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, టీజీపీఎస్సీ తరఫు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని