నేటి నుంచి మూడో విడత న్యాయ విచారణ

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై శుక్రవారం నుంచి మూడో విడత న్యాయ విచారణ ప్రారంభం కానుంది. ఈ నెల 16 వరకు ఈ ప్రక్రియ జరగనుంది.

Published : 07 Jun 2024 04:36 IST

హైదరాబాద్‌కు చేరుకున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై శుక్రవారం నుంచి మూడో విడత న్యాయ విచారణ ప్రారంభం కానుంది. ఈ నెల 16 వరకు ఈ ప్రక్రియ జరగనుంది. కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం నీటిపారుదలశాఖ అధికారులు కమిషన్‌తో భేటీ అయ్యారు. రెండ్రోజుల్లో నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు. మూడు బ్యారేజీల్లో జరిగిన అవకతవకలపై న్యాయవిచారణ చేపట్టాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జస్టిస్‌ ఘోష్‌ ఏప్రిల్‌ 24న విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను ఆయన సందర్శిస్తారని ఆశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని