సీఎం సహాయనిధి పునరుద్ధరణ

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్‌ ఫండ్‌)ని ప్రభుత్వం పునరుద్ధరించింది.

Published : 07 Jun 2024 04:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్‌ ఫండ్‌)ని ప్రభుత్వం పునరుద్ధరించింది. నూతన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎన్నికల నియమావళి రావడంతో.. వేలాదిగా సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో సీఎంఆర్‌ఎఫ్‌ కింద నిధులు విడుదల చేసి.. మధ్యలో నిలిపివేసిన సుమారు 60 వేల మంది లబ్ధిదారులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేయడానికి సర్కారు సన్నాహాలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని