కొత్త క్రిమినల్‌ చట్టాలపై ఐపీఎస్‌ల వర్క్‌షాప్‌

కొత్త క్రిమినల్‌ చట్టాలపై తెలంగాణ పోలీస్‌ అకాడమీలో గురువారం వర్క్‌షాప్‌ జరిగింది. క్రిమినల్‌ లాయర్‌ ఎ.పి.సురేశ్‌ చట్టాల గురించి వివరించారు.

Published : 07 Jun 2024 04:38 IST

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డీజీపీ రవిగుప్తా. చిత్రంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి డా.జితేందర్, పోలీస్‌ ఉన్నతాధికారులు, తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త క్రిమినల్‌ చట్టాలపై తెలంగాణ పోలీస్‌ అకాడమీలో గురువారం వర్క్‌షాప్‌ జరిగింది. క్రిమినల్‌ లాయర్‌ ఎ.పి.సురేశ్‌ చట్టాల గురించి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 మంది ఐపీఎస్‌ అధికారులు బృందాలుగా విడిపోయి చట్టాల్లో మార్పుల గురించి చర్చించారు. పోలీస్‌ అకాడమీ రూపొందించిన ‘న్యూ క్రిమినల్‌ లా బుక్స్‌’, సీఐడీ రూపొందించిన ‘రెడీ రెకనర్‌ ఆఫ్‌ న్యూ లాస్‌’ పుస్తకాలతోపాటు పోలీస్‌ అకాడమీ తయారుచేసిన ‘న్యూ క్రిమినల్‌ లాస్‌’ యాప్‌ను డీజీపీ రవిగుప్తా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు డీజీపీలు కొత్తకోట శ్రీనివాసరెడ్డి, అభిలాష బిష్త్, శిఖాగోయెల్, మహేశ్‌ భగవత్, సంజయ్‌కుమార్‌ జైన్, విజయ్‌కుమార్, ఐజీలు తరుణ్‌జోషి, అవినాశ్‌మహంతితోపాటు కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని