వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది.

Updated : 07 Jun 2024 06:25 IST

26 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ కోర్సులకు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై, టీజీ పాలిసెట్‌ రాసి ర్యాంకు పొంది ఉండాలి. ఈ కోర్సులకుగాను పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 260 సీట్లు, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 540 సీట్లు ఉన్నాయి. వాటిలో 60 శాతం సీట్లు గ్రామీణ కోటాలో, 40 శాతం సీట్లు గ్రామీణేతర కోటాలో భర్తీ చేస్తారు. గ్రామీణ కోటా సీట్లకు విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏవైనా నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో చదివినట్లు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొని అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది. ఆ సీట్లను రిజర్వేషన్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తామని వర్సిటీ రిజిస్ట్రార్‌ రఘురామిరెడ్డి  తెలిపారు. పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ www.pjtsau.edu.in లో చూడాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని