హక్కుల సాధనకు మిలిటెంట్‌ ఉద్యమం: ఆర్‌.కృష్ణయ్య

రాష్ట్రంలో బీసీల న్యాయమైన హక్కుల సాధనకు పంథా మార్చి మిలిటెంట్‌ ఉద్యమం చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు.

Published : 07 Jun 2024 04:45 IST

ఐక్యత చాటుతున్న ఆర్‌.కృష్ణయ్య, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, బీసీ సంఘాల నేతలు

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బీసీల న్యాయమైన హక్కుల సాధనకు పంథా మార్చి మిలిటెంట్‌ ఉద్యమం చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సాయుధ పోరాటాలు కాకుండా హరియాణాలో జాట్స్‌ మాదిరి ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలని పేర్కొన్నారు. బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌-సమగ్ర కుల గణన’ అంశంపై గురువారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. బీసీ జన సభ అధ్యక్షుడు రాజారాం యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్‌ 42 శాతానికి పెంచాలన్నారు. భారాస నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల గణన చేపట్టడం ఆలస్యమైతే చట్టం ద్వారా రిజర్వేషన్లు తీసుకురావచ్చన్నారు. ‘మేమెంతో మాకంత’ అనే కాన్షీరామ్‌ ఆలోచనను రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. ఈ నెల 8న చలో ఇందిరాపార్కు, సచివాలయ ముట్టడి విజయవంతం చేస్తామని సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘాల నేతలు, నాయకులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని