టీజీఎస్‌ నకిలీ లోగో కేసులో హైకోర్టు నోటీసులు

టీజీఎస్‌ ఆర్టీసీ పేరుతో నకిలీ లోగో సృష్టించారన్న ఆరోపణలపై కొణతం దిలీప్‌రెడ్డి అలియాస్‌ కొణతం దిలీప్‌పై నమోదైన కేసులో పోలీసులకు, చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Published : 07 Jun 2024 04:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీజీఎస్‌ ఆర్టీసీ పేరుతో నకిలీ లోగో సృష్టించారన్న ఆరోపణలపై కొణతం దిలీప్‌రెడ్డి అలియాస్‌ కొణతం దిలీప్‌పై నమోదైన కేసులో పోలీసులకు, చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సీఆర్పీసీ సెక్షన్‌ 41ఎ నిబంధనలను అనుసరించాలని ఆదేశాలు జారీ చేసింది. నకిలీ లోగోను సృష్టించి ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ ఎ.శ్రీధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలంటూ కొణతం దిలీప్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల జస్టిస్‌ ఎ.సుజన విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తనపై అక్రమంగా కేసు నమోదు చేశారన్నారు. దీనిపై విచారణ పూర్తయ్యేదాకా అరెస్ట్‌ చేయరాదంటూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫిర్యాదుదారు శ్రీధర్‌కు, పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని