21 జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ ఎత్తివేత

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ను 12 జిల్లాల్లో మినహా మిగిలిన 21 జిల్లాల్లో ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 07 Jun 2024 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ను 12 జిల్లాల్లో మినహా మిగిలిన 21 జిల్లాల్లో ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఈఏడాది మార్చి 16న షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎన్నికల క్రతువు పూర్తిస్థాయిలో ముగిసేంత వరకు అమలు కొనసాగనుంది. రాష్ట్రం నుంచి గెలుపొందిన అభ్యర్థుల జాబితాకు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ ముద్రణ గురువారం పూర్తి కావటంతో ఎన్నికల కోడ్‌ ఎత్తివేసింది. రాష్ట్రంలో శాసనమండలిలోని వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాబట్టి సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో  ఎన్నికల కోడ్‌ కొనసాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని