కవితపై సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు

దిల్లీ మద్యం కేసులో కవిత పాత్రపై సీబీఐ శుక్రవారం ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. దిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు ఛార్జిషీట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది.

Published : 08 Jun 2024 05:28 IST

జ్యుడిషియల్‌ కస్టడీ ఈనెల 21 వరకు పొడిగింపు

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో కవిత పాత్రపై సీబీఐ శుక్రవారం ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. దిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు ఛార్జిషీట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది. దీన్ని పరిగణనలోకి తీసుకొనే అంశంపై కోర్టు జులై 6న విచారణ జరుపుతుంది. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్‌ కస్టడీని కోర్టు ఈనెల 21 వరకు పొడిగించింది. ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న ఆమె... చదువుకోవడానికి కొత్తగా తొమ్మిది పుస్తకాలను కోరగా అందుకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని