పార్వతీ బ్యారేజీ సమీపంలో కరకట్ట గండి పూడ్చివేత

నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకు పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద ఉన్న సుందిళ్ల(పార్వతీ) బ్యారేజీ సమీపంలోని కరకట్టకు పడిన గండిని అధికారులు పూడ్చివేశారు.

Published : 08 Jun 2024 05:35 IST

 

మట్టితో పూడ్చిన గండి 

మంథని, న్యూస్‌టుడే: నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకు పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద ఉన్న సుందిళ్ల(పార్వతీ) బ్యారేజీ సమీపంలోని కరకట్టకు పడిన గండిని అధికారులు పూడ్చివేశారు. 2022 జులై 17న గోదావరిలో వచ్చిన వరదలకు కరకట్టకు గండి పడింది. బ్యారేజీ సీసీ బ్లాక్‌ల లెవెలింగ్, సిమెంట్‌ దిమ్మెలను సరిచేయడం వంటి పనుల్లో భాగంగా కరకట్టపై పడిన గండిని పొక్లెయిన్‌ సహాయంతో మట్టితో పూడ్చివేశారు. వర్షాలకు కరకట్టకు మళ్లీ గండి పడకుండా ముందు జాగ్రత్తగా బండరాళ్లు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని