తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోక-కోలా సంస్థను మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.

Published : 08 Jun 2024 05:39 IST

కోకా-కోలా సంస్థను కోరిన మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి

కోకా-కోలా సంస్థ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌ను సన్మానిస్తున్న మంత్రులు కోమటిరెడ్డి,
శ్రీధర్‌బాబు. చిత్రంలో ఐటీ,  పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోక-కోలా సంస్థను మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. అమెరికా పర్యటనలో వీరిద్దరూ శుక్రవారం అట్లాంటాలోని కోకా-కోలా ప్రధాన కార్యాలయంలో ఆ కంపెనీ డైరెక్టర్‌(అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగం) జోనథన్‌ రీఫ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయంటూ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌లో పెట్టుబడులకు జోనథన్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. అనంతరం అట్లాంటాలోని డెల్టా ఎయిర్‌ లైన్స్‌ కార్యాలయంలోనూ ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్, సీటీవో నారాయణన్‌ కృష్ణకుమార్‌తో మంత్రులు భేటీ అయ్యారు. వారి వెంట ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, పెట్టుబడులశాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని