విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా డా.జితేందర్‌

తెలంగాణ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా డా.జితేందర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Published : 08 Jun 2024 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా డా.జితేందర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. డీజీపీ హోదా కలిగిన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఇంతకుముందు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేసిన రాజీవ్‌రతన్‌ ఇటీవలే గుండెపోటుతో మరణించడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. తాజాగా డా.జితేందర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సందీప్‌శాండిల్య పునర్నియామకం

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సందీప్‌శాండిల్యను రాష్ట్ర ప్రభుత్వం పునర్నియమించింది. 1993 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన గత నెలాఖరున ఉద్యోగ విరమణ పొందారు. ఆ సమయంలో తెలంగాణ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(టీన్యాబ్‌) డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పునర్నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన టీన్యాబ్‌ డైరెక్టర్‌గా ఏడాదిపాటు కొనసాగనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని