సంస్కృతిని చూస్తూ.. కుంచెతో గీస్తూ

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన ఏల్పుల పోచం లైవ్‌ ఆర్ట్స్‌ యాత్ర శుక్రవారం కన్యాకుమారిలో ముగిసింది.

Published : 08 Jun 2024 05:46 IST

చిత్రకారుడు ఏల్పుల పోచం లైవ్‌ఆర్ట్స్‌ యాత్ర కన్యాకుమారిలో ముగింపు

కన్యాకుమారిలోని వివేకానందరాక్‌ మెమోరియల్‌ వద్ద జాతీయ పతాకాన్ని చూపిస్తున్న ఏల్పుల పోచం

చెన్నూరు, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన ఏల్పుల పోచం లైవ్‌ ఆర్ట్స్‌ యాత్ర శుక్రవారం కన్యాకుమారిలో ముగిసింది. దేశంలోని సంస్కృతిని నిజ జీవితంలో చూస్తూ బొమ్మలు వేయాలని 2017లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి పేరిట కళాయాత్ర చేపట్టారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజల జీవన విధానాలు, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన చిత్రాలను చూస్తూ తన కుంచెతో ప్రత్యక్షంగా బొమ్మలు గీశారు. 2017లో మొదలైన ఈ యాత్ర మధ్యలో విరామాలు మినహా 2,140 రోజులపాటు సాగింది. 30,700 కి.మీ. మేర పయనించారు. దాతలు, మిత్రుల సహకారంతో దేశవ్యాప్తంగా ఆయన తన కళాయాత్రను పూర్తిచేశారు. ప్రతి రాష్ట్రంలోని ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలను చూపించే విధంగా బొమ్మలను గీశానని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని