సింగూరు కాలువల లైనింగ్‌కు రూ.168 కోట్ల విడుదల

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కాలువల లైనింగ్‌ నిర్మాణానికి రూ.168.30 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 08 Jun 2024 05:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కాలువల లైనింగ్‌ నిర్మాణానికి రూ.168.30 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. అందోలు, పుల్కల్, చౌట్కూరు, మునిపల్లి, సదాశివపేట మండలాల్లోని కాలువలకు సీసీ లైనింగ్‌ నిర్మాణాలు చేపట్టనున్నారు. 

మానేరు వాగుపై చెక్‌డ్యాంకు రూ.30 కోట్లు 

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌ మండలం మంచరామి గ్రామ సమీపంలో మానేరు వాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.30.67 కోట్లు మంజూరయ్యాయి. 2019లో రాష్ట్రంలో రూ.3,825 కోట్లతో చెక్‌డ్యాంల నిర్మాణాలకు నాటి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. దానిలో భాగంగా 2020లో ఈ చెక్‌డ్యాంకు రూ.19.77 కోట్లు మంజూరు ఇచ్చింది. 2023 ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్సీ) సమావేశంలో ఈ చెక్‌డ్యాం అంచనాలను రూ.34.20 కోట్లకు సవరించారు. తాజాగా రూ.30.67 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 

 సుల్తానాబాద్‌ మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలో మానేరు వాగుపై రూ.27.09 కోట్లతో మరో చెక్‌డ్యాం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2020లోనే ఈ నిర్మాణానికి రూ.21.07 కోట్లకు సాంకేతిక అనుమతులు మంజూరయ్యాయి. 2023లో జరిగిన ఎస్‌ఎల్‌ఎస్సీ సమావేశంలో రూ.29.96 కోట్లకు అంచనాల పెంపునకు నిర్ణయం తీసుకోగా తాజాగా ప్రభుత్వం రూ.27.09 కోట్లకు మంజూరు ఇచ్చింది. 

ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో లిఫ్టుల పునరుద్ధరణకు.. 

నిర్మల్‌ మండలంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా నిర్మిస్తున్న సిద్దుల కుంట ఎత్తిపోతల పనులకు రూ.80.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. లోకేశ్వరం మండలంలో కనకాపూర్‌ ఎత్తిపోతల ఆధునికీకరణకు రూ.1.42 కోట్లు మంజూరు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని