చేనేత సంఘాలకు త్వరలో ఎన్నికలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రాథమిక చేనేత సహకార సంఘాలు మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా, ప్రైవేటు కంపెనీలతో పోటీ పడేలా నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Published : 09 Jun 2024 04:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాథమిక చేనేత సహకార సంఘాలు మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా, ప్రైవేటు కంపెనీలతో పోటీ పడేలా నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శనివారం తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు మంత్రిని సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా చేనేత సంఘాల్లోని నిల్వలను కొనుగోలు చేయాలని, నేతన్నకు చేయూతనివ్వాలని, బకాయిలు చెల్లించాలని తదితర అంశాలపై విజ్ఞప్తి చేశారు. మంత్రి వారితో మాట్లాడుతూ చేనేత కార్మికులకు దీర్ఘకాలిక లబ్ధి, 365 రోజులూ చేతినిండా పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెస్కో ద్వారానే ప్రభుత్వ శాఖలు విత్తనాలు కొనుగోలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, అలాగే రూ.255 కోట్ల విలువైన ఆర్డర్లు టెస్కోకు వస్త్ర సరఫరా కోసం వచ్చాయన్నారు. పది శాతం నూలు సబ్సిడీ కింద రూ.33.23 కోట్లు విడుదల చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు