ప్రపంచస్థాయి బౌద్ధ పర్యాటక స్థలంగా సాగర్‌ అభివృద్ధి: జూపల్లి

ప్రపంచస్థాయిలో బౌద్ధ పర్యాటక స్థలంగా నాగార్జునసాగర్‌కు గుర్తింపు తీసుకొస్తామని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Published : 09 Jun 2024 04:25 IST

బుద్ధపాదుకల వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి తదితరులు

నాగార్జునసాగర్, న్యూస్‌టుడే: ప్రపంచస్థాయిలో బౌద్ధ పర్యాటక స్థలంగా నాగార్జునసాగర్‌కు గుర్తింపు తీసుకొస్తామని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం సాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి బుద్ధవనాన్ని ఆయన సందర్శించారు. బుద్ధచరితవనం, జాతకపార్కు, మహాస్తూపం, వ్యూ పాయింట్‌ను తిలకించారు. బుద్ధవనం గురించి బౌద్ధమత పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆచార్య నాగార్జునుడు తిరిగిన ఈ ప్రదేశానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి బౌద్ధ భిక్షువు ఇక్కడికి వచ్చే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతామన్నారు. బుద్ధవనం నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల చెల్లింపులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పీసీసీ కార్యవర్గ సభ్యుడు కర్నాటి లింగారెడ్డి, పర్యాటక సంస్థ జీఎంలు నాథన్, ఉపేందర్‌రెడ్డి, బుద్ధవనం ఓఎస్డీ సూదన్‌రెడ్డి, బౌద్ధమత పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి, నందికొండ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు