జాతీయ లోక్‌అదాలత్‌లో 10.35 లక్షల కేసుల పరిష్కారం

జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల స్థాయి కోర్టుల్లో శనివారం జరిగిన లోక్‌అదాలత్‌కు విశేష స్పందన లభించింది.

Published : 09 Jun 2024 04:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల స్థాయి కోర్టుల్లో శనివారం జరిగిన లోక్‌అదాలత్‌కు విశేష స్పందన లభించింది. మొత్తం 10.35 లక్షలకుపైగా కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో పెండింగ్‌ కేసులు 4.54 లక్షలు, ప్రాథమిక దశలో ఉన్నవి 5.81 లక్షల కేసులు ఉన్నాయి. లబ్ధిదారులకు పరిహారంగా రూ.743 కోట్లు ప్రకటించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి సీహెచ్‌.పంచాక్షరి వెల్లడించారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ సుజయ్‌పాల్, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌ అభినంద్‌కుమార్‌ షావిలి సూచనలతో జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించినట్లు తెలిపారు.

హైకోర్టులో 132 కేసులు..

హైకోర్టులో జరిగిన లోక్‌ అదాలత్‌లో 132 కేసులు పరిష్కారం కాగా ఇందులో మోటారు వాహనాల చట్టానికి చెందిన కేసులు 96 దాకా ఉన్నాయి. వీటితోపాటు ప్రాథమిక దశలో ఉన్న కేసులు 31 దాకా ఉన్నాయి. లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారం ద్వారా రూ.9.5 కోట్లను పరిహారంగా ప్రకటించగా, 900 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.శరత్, జస్టిస్‌ జె.శ్రీనివాసరావులు కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని