పార్వతీ బ్యారేజీని సందర్శించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌

కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్‌ విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ శనివారం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పార్వతీ(సుందిళ్ల) బ్యారేజీని సందర్శించారు.

Published : 09 Jun 2024 04:26 IST

బ్యారేజీ వద్ద అధికారులతో మాట్లాడుతున్న జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ 

ఈనాడు, పెద్దపల్లి -న్యూస్‌టుడే, మంథని గ్రామీణం: కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్‌ విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ శనివారం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పార్వతీ(సుందిళ్ల) బ్యారేజీని సందర్శించారు. శుక్రవారం రాత్రి రామగుండంలోని ఎన్టీపీసీ అతిథిగృహానికి చేరుకుని బస చేసిన ఆయన.. శనివారం ఉదయం సుందిళ్ల గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిరిపురం గ్రామంలోని సుందిళ్ల బ్యారేజీకి చేరుకుని.. తెరిచిన గేట్లను ప్రాజెక్టుపై నుంచి పరిశీలించారు. అనంతరం వాహనంపై 1.45 కిలోమీటర్ల మేర విస్తరించిన ప్రాజెక్టు చివరి(74వ) గేటు నుంచి ఒకటో గేటు వరకు చూశారు. పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఎన్‌డీఎస్‌ఏ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు నిర్వహిస్తున్నారా? లేదా? అని సమీక్షించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని నివేదికల రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులు, నిర్వహణ విభాగం ఈఎన్‌సీ నాగేందర్‌రావు, సీఈలు సుధాకర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ఎస్‌ఈ కరుణాకర్, ఈఈ ఓంకార్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని