విజయం వరించేది సాహసవంతుల్ని, కార్యసాధకుల్నే

కోట్ల మంది జీవితాలను ఉన్నతంగా ప్రభావితం చేసిన వ్యక్తుల జీవనయానాన్ని పరిశీలిస్తే.. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటి సాధనకు అహరహం శ్రమించడం, ఉత్తమ ఆదర్శాలను పాటించడం, సహచరులు, ఉద్యోగుల్లో స్ఫూర్తినింపేలా వ్యవహరించడం, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం వంటి సుగుణాలు కనిపిస్తాయి.

Published : 09 Jun 2024 06:44 IST

విజయం వరించేది సాహసవంతుల్ని, కార్యసాధకుల్నే
రామోజీ పాటించిన జీవనసూత్రాలివే..
ఈనాడు, హైదరాబాద్‌

కోట్ల మంది జీవితాలను ఉన్నతంగా ప్రభావితం చేసిన వ్యక్తుల జీవనయానాన్ని పరిశీలిస్తే.. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటి సాధనకు అహరహం శ్రమించడం, ఉత్తమ ఆదర్శాలను పాటించడం, సహచరులు, ఉద్యోగుల్లో స్ఫూర్తినింపేలా వ్యవహరించడం, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం వంటి సుగుణాలు కనిపిస్తాయి. రామోజీ గ్రూపు సంస్థల నిర్మాణం, విజయవంతంగా వాటి నిర్వహణ ద్వారా కోట్లలో ఒకరిగా నిలిచారు రామోజీరావు. ఆయన ఆచరించిన జీవనసూత్రాలు.. విజయమార్గాలనడానికి ఆయన జీవితమే ఉదాహరణ. ఆ సూత్రాలివీ..

 • సవాళ్లు లేని జీవితం నిస్సారం.
 • క్రమశిక్షణ, కష్టపడటం, కలిసి పనిచేయడం.. విజయానికి మూల కారణాలు.
 • మనందరిలోనూ అపరిమితమైన శక్తి ఉంటుంది. దాన్ని తెలుసుకోవడంలోనే అంతా ఉంది. మనకేం కావాలో ఏం వద్దో మన శరీరమే చెబుతుంది. గ్రహించగలిగే శక్తి ఉంటే, ఆ ప్రకారం నడుచుకుంటే అంతా సవ్యంగానే ఉంటుంది.
 • ఎంత చేయాలన్న దానికి పరిమితులు, కొలమానాలు లేవు. కావాల్సింది చేయాలన్న చిత్తశుద్ధి, చేసి చూపాలన్న దృఢ దీక్ష మాత్రమే.
 • గెలుపు సాధించడం కన్నా.. దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా ముఖ్యం.
 • సాహసవంతుల్ని, కార్యసాధకుల్ని మాత్రమే విజయం వరిస్తుంది.
 • విమర్శని స్వీకరించకపోతే ప్రగతి లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తి లేని జీవితం వృథా.
 • జర్నలిజం ఉద్యోగం కాదు.. ప్రజా సంక్షేమ జీవన విధానం.
 • ప్రతిదీ ప్రభుత్వమే చేయాలని దాదాపు ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఇది తమ అసమర్థతను పరోక్షంగా అంగీకరించడమే.
 • శాస్త్ర పరిశోధనలకు పల్లె బతుకులే ముడిసరకు కావాలి. గ్రామీణ జీవితమే ప్రయోగాలకు గీటురాయి కావాలి. గ్రామీణ విప్లవ సాధనకు ప్రతి శాస్త్రవేత్త ఒక సామాజికవేత్త కావాలి.
 • కర్ర పెత్తనంతో భయపెట్టి సాధించగలిగేది ఏమీ లేదు. కోపంతో అదుపు తప్పే వ్యక్తి నాయకునిగా ఎదగలేడు.
 • ఏదో ఒకటి చేయాలన్న తపన, ఏదైనా సాధించినప్పుడు పొందే తృప్తి... వీటిని మించిన ప్రోత్సాహకాలు లేవు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని