రామోజీరావు విశేష సేవలు అందించారు

పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకులుగా రామోజీరావు విశేష సేవలు అందించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నా. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

Published : 09 Jun 2024 06:50 IST

పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకులుగా రామోజీరావు విశేష సేవలు అందించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నా. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

కేసీఆర్‌ , మాజీ సీఎం, భారాస అధ్యక్షుడు 


తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయన గుర్తుంటారు

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌. చిత్రంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. జీవితంలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఉన్నా సరే గొప్ప విజయాలను ఎలా సాధించవచ్చన్నది ఆయన ప్రస్థానం ద్వారా మనం నేర్చుకోవచ్చు. తెలుగు పత్రికా రంగం, ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన మహనీయుడు ఆయన. విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా నిలిచిపోతారు. ఈనాడు, ఈటీవీతో తనదైన ముద్ర వేశారు. ఎల్లవేళలా తెలుగు రాష్ట్రాలు, దేశం బాగుండాలని తపించేవారు. తెలుగు భాషను ఆయన అభిమానించిన విధానం, తపన అందరికీ ఆదర్శం. గత దశాబ్ద కాలంలో చాలాసార్లు ఆయనతో మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. తన మాటలతో నాలో ఎంతో స్ఫూర్తి నింపారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా రామోజీరావు గుర్తులు, ఆశయాలు, ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయన గుర్తుంటారు. అలాంటి గొప్ప మనిషి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.

కేటీఆర్, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని