సంక్షిప్త వార్తలు (6)

నైరుతి రుతుపవనాలు నిజామాబాద్‌ జిల్లా వరకు విస్తరించాయి. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాపించనున్నాయి. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది.

Updated : 10 Jun 2024 06:56 IST

నిజామాబాద్‌ వరకు విస్తరించిన నైరుతి
రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు నిజామాబాద్‌ జిల్లా వరకు విస్తరించాయి. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాపించనున్నాయి. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. మరోవైపు శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ఖమ్మం జిల్లా కొణిజర్లలలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో నారాయణ సంచలనం

ఈనాడు, అమరావతి: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు సంచలనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో సందేశ్‌ భోగాలపల్లి 3వ ర్యాంకు, రాజ్‌దీప్‌ మిశ్రా 6వ ర్యాంకు, ఎం.బాలాదిత్య 11వ ర్యాంకు, రాఘవ్‌ శర్మ 12వ ర్యాంకు, బిస్మిత్‌ సాహు 16వ ర్యాంకు, ఆర్యన్‌ ప్రకాశ్‌ 17వ ర్యాంకు, అమోఘ్‌ అగర్వాల్‌ 20వ ర్యాంకు సాధించారన్నారు. వీరితో పాటు 100లోపు 31 ర్యాంకులతో రికార్డు సృష్టించామని తెలిపారు. వివిధ కేటగిరీలలో 6 ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులు నారాయణవేనని వెల్లడించారు. విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పునీత్‌ కొత్తప అభినందనలు తెలిపారు.


సత్తా చాటిన శ్రీచైతన్య

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య యాజమాన్యం తెలిపింది. రాఘవశర్మ ఆలిండియా మొదటి ర్యాంకు, ఓపెన్‌ కేటగిరీలో రిథమ్‌ కేడియా 4వ ర్యాంకు, పుట్టి కుశాల్‌ కుమార్‌ 5వ ర్యాంకు, రాజదీప్‌ మిశ్రా 6వ ర్యాంకు, ధృవిన్‌ హేమంత్‌ దోషి 9వ ర్యాంకు, అల్లడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్ధ్విక్‌ సుహాస్‌ 10వ ర్యాంకు సాధించినట్లు వెల్లడించింది. వీటితో పాటు ఓపెన్‌ కేటగిరీలో టాప్‌ 10 లోపు 5 ర్యాంకులు, 100 లోపు 30 ర్యాంకులు, 1000 లోపు 202 ర్యాంకులు, వివిధ కేటగిరీల్లో 100 లోపు 146, 1000 లోపు 721 ర్యాంకులు వచ్చాయని చెప్పింది. మొత్తంగా 3,728 మంది విద్యార్థులు అర్హత సాధించారని పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ అభినందించారు. 


అల్ఫోర్స్‌ విజయఢంకా

కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యార్థులు వివిధ విభాగాల్లో జాతీయస్థాయిలో మంచి ర్యాంకులతో విజయఢంకా మోగించారని విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ వి.నరేందర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఎం.హర్షిత్‌ 64వ ర్యాంకు, జి.శ్రీహాస్‌ 290, బి.భరద్వాజ్‌ 396, ఆర్‌.పునీత్‌మనోహర్‌ 477, సుబోధ్‌చౌదరి 545, ఎ.శివవరుణ్‌ 557, పి.రాహుల్‌ 571, దేవదత్త 751, విశాల్‌రెడ్డి 838 ర్యాంకు సాధించారని చెప్పారు. 2 వేలలోపు ర్యాంకులను 17 మంది, 5 వేలలోపు ర్యాంకులను 32 మంది విద్యార్థులు సాధించారని వెల్లడించారు.


ఎస్‌ఆర్‌ ప్రభంజనం

హనుమకొండ చౌరస్తా, న్యూస్‌టుడే: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని సంస్థల ఛైర్మన్‌ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తెలిపారు. వివిధ కేటగిరీల్లో పి.రాకేష్‌కుమార్‌ 6వ ర్యాంకు, జి.నవీన్‌ 8, జె.స్నేహిత్‌ సందేష్‌ 123, వి.రాంబాబు 125, వి.వేదవచణ్‌రెడ్డి 127, జె.శ్రేతన్‌రెడ్డి 133, బి.దినేష్‌ 157, ఎం.వెంకటేశ్వర్లు 185, డి.కార్తీక్‌ 299, టి.అఖిల్‌నాయక్‌ 323, కె.శ్రీరాంరెడ్డి 324వ ర్యాంకు సాధించారని తెలిపారు. 


11న కొండా లక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీ స్నాతకోత్సవం

ఈనాడు, హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లా ములుగులో ఈ నెల 11న కొండాలక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవం జరగనుంది. వర్సిటీ కులపతి, రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ అధ్యక్షతన జరిగే స్నాతకోత్సవానికి తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి గీతాలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్నాతకోత్సవంలో 156 మందికి ఉద్యాన డిగ్రీ, 50 మంది ఫారెస్ట్‌ డిగ్రీ, 45 మందికి ఉద్యాన పీజీ డిగ్రీ, ఆరుగురికి పీహెచ్‌డీ డాక్టరేట్‌ పట్టాలు అందజేస్తామని విశ్వవిద్యాలయ వీసీ నీరజ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని