గ్రూప్‌-1 పరీక్ష కేంద్రంలోకి మద్యం తాగి వచ్చిన ఉద్యోగి

గ్రూప్‌-1 పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన ఓ ఉద్యోగి మద్యం తాగి వచ్చి దురుసుగా ప్రవర్తించాడు.

Published : 10 Jun 2024 04:33 IST

తిమ్మాపూర్, న్యూస్‌టుడే: గ్రూప్‌-1 పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన ఓ ఉద్యోగి మద్యం తాగి వచ్చి దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జమ్మికుంట తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్న అన్వర్‌ మీర్జా పర్వేజ్‌ బేగ్‌కు తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాలలో గ్రూప్‌-1 పరీక్ష విధుల నిర్వహణ డ్యూటీ పడింది. అభ్యర్థుల ధ్రువప్రతాలను పరిశీలించి పరీక్షా హాలులోకి అనుమతించే  క్రమంలో తోటి సిబ్బంది, అభ్యర్థులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అక్కడే ఉన్న ఎల్‌ఎండీ పోలీసులు గమనించి, అతడు మద్యం తాగాడని నిర్ధారించి ఎల్‌ఎండీ ఠాణాకు తరలించారు. అనంతరం అతడి బంధువులు ఠాణాకు వచ్చి పర్వేజ్‌ బేగ్‌ను తీసుకెళ్లారు. ఇటీవల అనిశా అధికారులకు చిక్కిన పర్వేజ్‌ బేగ్‌ సస్పెండ్‌ అయ్యి తిరిగి విధుల్లో చేరినట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని