సైబర్‌ నేరాల బాధితులకు.. ఒక్కరోజే రూ.7.9 కోట్ల అప్పగింత

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) మరో ఘనత సాధించింది. సైబర్‌ నేరాల్లో చిక్కుకుని డబ్బు పోగొట్టుకున్న బాధితులకు ఒక్క రోజులోనే రూ.7.9 కోట్లు ఇప్పించి రికార్డు సృష్టించింది.

Published : 10 Jun 2024 04:34 IST

టీజీసీఎస్‌బీ మరో ఘనత

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) మరో ఘనత సాధించింది. సైబర్‌ నేరాల్లో చిక్కుకుని డబ్బు పోగొట్టుకున్న బాధితులకు ఒక్క రోజులోనే రూ.7.9 కోట్లు ఇప్పించి రికార్డు సృష్టించింది. ఈ నెల 8న జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 2,973 కేసులకు సంబంధించిన బాధితులకు ఈ మొత్తం సొమ్ము ఇప్పించగలిగింది. తెలంగాణ ప్రభుత్వ న్యాయ సేవాధికార సమితి(టీజీఎల్‌ఎస్‌ఏ) సహకారంతో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఆ ఒక్కరోజే మొత్తం 4,144 కేసులు న్యాయస్థానంలో నమోదవగా.. ఇంకా 1,171 కేసులను పరిష్కరించాల్సి ఉంది. వాటికి కూడా త్వరలోనే పరిష్కారం లభించనుంది. గత మార్చిలోనూ ఇదే రీతిలో లోక్‌అదాలత్‌లో 803 కేసుల్లో ఒక్క రోజే టీజీసీఎస్‌బీ రూ.3.66 కోట్లను ఇప్పించి బాధితులకు సాంత్వన కలిగించింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని