స్థిరాస్తి అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి

తెలంగాణ స్థిరాస్తి(రియల్‌ ఎస్టేట్‌) అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, న్యాయ విభాగం సభ్యులుగా న్యాయవాది పల్లె ప్రదీప్‌కుమార్‌రెడ్డి, పరిపాలన, సాంకేతిక సభ్యురాలిగా విశ్రాంత ఐఏఎస్‌ చిత్రా రామచంద్రన్‌ బాధ్యతలు చేపట్టారు.

Published : 10 Jun 2024 04:38 IST

 సభ్యులుగా ప్రదీప్‌కుమార్‌రెడ్డి, చిత్రా రామచంద్రన్‌ బాధ్యతల స్వీకరణ 

బాధ్యతలు స్వీకరించిన చిత్రా రామచంద్రన్, జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌రెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ స్థిరాస్తి(రియల్‌ ఎస్టేట్‌) అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, న్యాయ విభాగం సభ్యులుగా న్యాయవాది పల్లె ప్రదీప్‌కుమార్‌రెడ్డి, పరిపాలన, సాంకేతిక సభ్యురాలిగా విశ్రాంత ఐఏఎస్‌ చిత్రా రామచంద్రన్‌ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల వారి నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో రెరా ఛైర్మన్‌ ఎన్‌.సత్యనారాయణ, సభ్యులు కె.శ్రీనివాసరావు, జె.లక్ష్మినారాయణ పాల్గొని నూతన ఛైర్మన్, సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం ట్రైబ్యునల్‌ ఛైర్మన్, సభ్యులు, రెరా ఛైర్మన్, రెరా సభ్యులతో సమావేశమై రెరా పనితీరుపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని