రైతుభరోసా, రుణమాఫీ వెంటనే అమలు చేయాలి

రాష్ట్రంలో కౌలు రైతులకు వానాకాలం నుంచి రైతుభరోసా అమలు చేయాలని, రూ.2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

Published : 11 Jun 2024 04:29 IST

సీపీఎం కార్యదర్శివర్గ సమావేశంలో డిమాండ్‌

సమావేశంలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం, వీరయ్య, టి.జ్యోతి, విజయరాఘవన్, బీవీ రాఘవులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కౌలు రైతులకు వానాకాలం నుంచి రైతుభరోసా అమలు చేయాలని, రూ.2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. సోమవారమిక్కడ సీపీఎం కార్యాలయంలో టి.జ్యోతి అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో చేసిన తీర్మానాలను విలేకరులకు వారు వివరించారు. రాష్ట్రంలో 20 లక్షలమందికిపైగా కౌలురైతులు 30శాతానికి పైగా భూభాగంలో వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. ‘‘రైతు ఆత్మహత్యల్లో సగం మంది కౌలు రైతులే. రెండేళ్లుగా పంటల బీమా లేదు. ప్రభుత్వమే పూర్తిప్రీమియం చెల్లించేలా పంటల బీమా పథకాన్ని అమలుచేయాలి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు, గ్రాట్యుటీ, బీమా, జీపీఎఫ్, సరెండర్‌లీవుల బిల్లులు, పంచాయతీ, మున్సిపల్, ఒప్పంద కార్మికులకు వేతన బకాయిలు విడుదల చేయాలి. కార్మికుల కనీస వేతనాలు సవరించాలి’’ అని తీర్మానాలు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని