అన్నారం బ్యారేజీలో డ్రిల్లింగ్‌ పనుల ప్రారంభం

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వెంట్‌(పియర్లు) వద్ద బోర్‌ హోల్‌(డ్రిల్లింగ్‌) పనులు సోమవారం ప్రారంభమయ్యాయి.

Published : 11 Jun 2024 04:35 IST

35వ వెంట్‌ వద్ద కొనసాగుతున్న డ్రిల్లింగ్‌ పనులు

కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వెంట్‌(పియర్లు) వద్ద బోర్‌ హోల్‌(డ్రిల్లింగ్‌) పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. గతేడాది నవంబరులో బ్యారేజీ దిగువ ప్రాంతంలోని 3, 4 బ్లాకుల్లో 28, 35, 38, 44 వెంట్‌ల వద్ద సీపేజీలు(బుంగలు) ఏర్పడగా.. ఇంజినీరింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో నిపుణులు రసాయన పదార్థాలతో తాత్కాలికంగా గ్రౌటింగ్‌ చేశారు. అదే ప్రాంతంలో ఇటీవల సిమెంట్‌ గ్రౌటింగ్‌ చేపట్టగా.. రెండు రోజుల క్రితం పనులు పూర్తయ్యాయి. తాజాగా సోమవారం డ్రిల్లింగ్‌ పనులు ప్రారంభించారు. తొలుత 35వ వెంట్‌ వద్ద 25 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్‌ చేసి.. మట్టి, ఇసుక, బండరాళ్లను వెలికితీశారు. వాటి నమూనాలను మహారాష్ట్రలోని పుణెకు పరీక్షల నిమిత్తం పంపనున్నారు. బ్యారేజీ ఎగువ ప్రాంతమంతా ఇసుక మేటలు వేయగా.. ఇటీవల పూర్తిగా తొలగించారు. బ్యారేజీ ఎగువన 3, 4 బ్లాకుల వద్ద సిమెంట్‌ గ్రౌటింగ్‌ పనులు మరో మూడు రోజుల్లో చేపట్టనున్నట్లు తెలిసింది. బ్యారేజీ దిగువన సీసీ బ్లాకులు వరద ప్రభావానికి చెల్లాచెదురు కాగా వాటిని అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని