ఎస్‌జీటీలకూ న్యాయం చేయండి

భాషా పండితులు, పీఈటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తున్నందున సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీలు) నష్టపోకుండా ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలుగా...

Published : 11 Jun 2024 05:41 IST

సీఎం రేవంత్‌రెడ్డికి టీఆర్‌టీఎఫ్‌ వినతి

సీఎంకు వినతిపత్రం అందజేస్తున్న అంజిరెడ్డి, అశోక్‌కుమార్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: భాషా పండితులు, పీఈటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తున్నందున సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీలు) నష్టపోకుండా ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించాలని, అందుకు ఆ పోస్టులను 10 వేలకు పెంచాలని టీఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మారెడ్డి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కావలి అశోక్‌కుమార్‌ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎంకు వినతిపత్రం సమర్పించారు. గతంలో హామీ ఇచ్చిన మేరకు పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులు, విద్యావాలంటీర్లను త్వరగా నియమించాలని కోరారు. అనంతరం టీఆర్‌టీఎఫ్‌ నేతలు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని