నకిలీ ఔషధాలపై ఉక్కుపాదం

రాష్ట్రంలో నకిలీ ఔషధాల తయారీని ఉక్కుపాదంతో అణచివేయడానికి వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టిందని ఆ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు.

Published : 11 Jun 2024 05:44 IST

మంత్రి దామోదర్‌ రాజనర్సింహ 
17 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు నియామకపత్రాల అందజేత 

నియామకపత్రాలు అందుకున్న వారితో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఆర్‌.వి.కర్ణన్, ఇతర అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నకిలీ ఔషధాల తయారీని ఉక్కుపాదంతో అణచివేయడానికి వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టిందని ఆ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. నకిలీ ఔషధాల నివారణకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నూతనంగా ఎంపికైన 17 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు మంత్రి సోమవారం సచివాలయంలో నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.వి.కర్ణన్, జాయింట్‌ డైరెక్టర్‌ రాందాన్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నాణ్యమైన మందులను నిర్దేశించిన ధరలకు అందేలా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు కృషి చేయాలని సూచించారు. సమాజ హితం కోసం ఉద్యోగ విధులను నిర్వహించాలన్నారు. నకిలీ మందులను నివారణపై మరింత సమర్థంగా పర్యవేక్షణ ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నియామకాలు చేసిందని చెప్పారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జోన్‌-1 నుంచి ఐదుగురు, జోన్‌-2 నుంచి 12 మంది ఎంపికవగా మంత్రి వారికి నియామక పత్రాలను అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు