Rains: ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం: ఐఎండీ

రాబోయే నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో ఈసారి సగటున సాధారణం కంటే అధిక వర్షపాతానికి అవకాశాలున్నట్లు పేర్కొంది.

Published : 28 May 2024 04:52 IST

నాలుగైదు రోజుల్లో కేరళ తీరానికి రుతుపవనాలు

ఈనాడు, హైదరాబాద్, దిల్లీ: రాబోయే నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో ఈసారి సగటున సాధారణం కంటే అధిక వర్షపాతానికి అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈశాన్య భారత్‌లో సాధారణం కంటే తక్కువగా, వాయవ్య ప్రాంతంలో సాధారణంగా, మిగతా ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా పడతాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర సోమవారం తెలిపారు. 

జైనలో 46.5 డిగ్రీలు 

పశ్చిమ, వాయవ్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశాలున్నాయి. సోమవారం అత్యధికంగా జగిత్యాల జిల్లా జైనలో 46.5, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో ఎండ తక్కువగా ఉన్నా ఉక్కపోత, వేడితో ప్రజలు అవస్థలు పడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని