Medigadda Barrage: మేడిగడ్డలో షీట్‌ పైల్స్‌ పనుల ప్రారంభం

మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పునరుద్ధరణ చర్యల్లో భాగంగా దెబ్బతిన్న ఏడో బ్లాక్‌ ప్రాంతం వరద ఉద్ధృతిని తట్టుకునే విధంగా షీట్‌ పైల్స్‌ ఏర్పాటు పనులను ఆదివారం ప్రారంభించారు.

Published : 27 May 2024 03:10 IST

ఒక వరుస సీసీ బ్లాక్‌ల తొలగింపు
కొనసాగుతున్న గేట్ల కటింగ్‌ పనులు

20వ గేటు వద్ద సాగుతున్న కటింగ్‌ పనులు

మహదేవపూర్, న్యూస్‌టుడే: మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పునరుద్ధరణ చర్యల్లో భాగంగా దెబ్బతిన్న ఏడో బ్లాక్‌ ప్రాంతం వరద ఉద్ధృతిని తట్టుకునే విధంగా షీట్‌ పైల్స్‌ ఏర్పాటు పనులను ఆదివారం ప్రారంభించారు. మేడిగడ్డ బ్యారేజీ దిగువ ప్లాట్‌ఫాం వద్ద సీసీ బ్లాకుల్లో ఒక వరుస తొలగిస్తున్నారు. తదుపరి షీట్‌ పైల్స్‌ ఏర్పాటు పూర్తి చేస్తారు. బ్యారేజీలో గేట్లు తొలగించేందుకు కటింగ్‌ పనులు సాగుతున్నాయి. దెబ్బతిన్న గేట్లలో 15వ గేటును ఎత్తగా 16వ గేటు ఎత్తే క్రమంలో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. 18, 19, 20, 21 గేట్లను పూర్తిగా కట్‌చేసి తీయాల్సిన పరిస్థితులుండగా ప్రస్తుతం 20వ గేటు కటింగ్‌ పనులు జరుగుతున్నాయి. 16, 17, 22 గేట్లను సాధారణ స్థితిలో ఎత్తడం వీలు కాకపోతే కటింగ్‌తో తొలగించనున్నారు. మరోవైపు ఏడో బ్లాక్‌ ప్రాంతంలో బుంగ, నీటి ఊటలు ఏర్పడగా వాటిని నియంత్రించడానికి ఇసుకను నింపుతున్నారు. గ్రౌటింగ్‌ చేయడానికి యంత్రాలు, సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. సోమవారం లేదా మంగళవారం గ్రౌటింగ్‌ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు