Mancherial: ఎనిమిది సంవత్సరాలుగా మరుగుదొడ్డిలోనే జీవనం

ఎనిమిది సంవత్సరాలుగా మరుగుదొడ్డిలోనే బతుకు పోరాటం సాగిస్తున్నారు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన 51 ఏళ్ల పెరుగు లింగయ్య. కుష్ఠు వ్యాధి బాధితుడైన ఆయన పింఛనుకూ నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు.

Published : 26 May 2024 04:06 IST

ఎనిమిది సంవత్సరాలుగా మరుగుదొడ్డిలోనే బతుకు పోరాటం సాగిస్తున్నారు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన 51 ఏళ్ల పెరుగు లింగయ్య. కుష్ఠు వ్యాధి బాధితుడైన ఆయన పింఛనుకూ నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. 20 ఏళ్ల క్రితం భార్య లక్ష్మి అనారోగ్యంతో మరణించగా.. ఏకైక కుమారుడు వారి అమ్మమ్మ వద్ద పెరిగి అక్కడే ఉంటున్నారు. దీంతో ఒంటరిగా ఉంటున్న లింగయ్య.. పూరి గుడిసె కూలిపోవడంతో ఇంటి ఆవరణలోని మరుగుదొడ్డినే ఆవాసంగా మార్చుకున్నారు. నాలుగు అడుగుల ఆ గదిలో వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ.. చలికి వణుకుతూ జీవనం గడుపుతున్నారు. అనారోగ్యంతో పనికి వెళ్లే పరిస్థితి లేని ఆయన రేషన్‌ బియ్యంతో అన్నం వండుకుని, భిక్షాటనతో కూరలు తెచ్చుకుంటారు. తన దీనస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా ఇందిరమ్మ ఇల్లు, పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

న్యూస్‌టుడే, లక్షెట్టిపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు