Monsoon: మరింత విస్తరించిన నైరుతి.. నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. శుక్రవారం నాటికి సగానికి పైగా జిల్లాలను తాకాయని వాతావరణశాఖ పేర్కొంది.

Updated : 08 Jun 2024 06:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. శుక్రవారం నాటికి సగానికి పైగా జిల్లాలను తాకాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో 8, 9, 10, 11వ తేదీల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. శని, ఆదివారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఓ మోస్తరు.., 10, 11లలో నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు శుక్రవారం వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం రేమద్దులలో 8.3, ఆత్మకూరు మండలంలో కొన్నిచోట్ల 7.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాల్లోనూ చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లోనూ తేలికపాటి జల్లులు కురిశాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని