Group 4: గ్రూప్‌-4 మెరిట్‌ జాబితా వెల్లడి

రాష్ట్రంలో 8180 గ్రూప్‌-4 సర్వీసుల పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ పోస్టులకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది.

Published : 10 Jun 2024 06:09 IST

 13 నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 8180 గ్రూప్‌-4 సర్వీసుల పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ పోస్టులకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని... నాంపల్లి కమిషన్‌ కార్యాలయం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో పరిశీలన కొనసాగుతుందని కమిషన్‌ వెల్లడించింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన రోజువారీ షెడ్యూలును త్వరలో టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరుస్తామని కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి చెక్‌లిస్టు, అటెస్టేషన్‌ ఫారాలు డౌన్‌లోడ్‌ చేసుకుని, సంబంధిత పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఖాళీల వారీగా వెబ్‌ఆప్షన్లు ఇచ్చేందుకు ఈ నెల 13 నుంచి వెబ్‌ఆప్షన్ల లింకు అందుబాటులోకి వస్తుందన్నారు. వెబ్‌ఆప్షన్లు ఇచ్చినవారినే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు అనుమతిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని