TG ECET: 8 నుంచి ఈసెట్‌.. 20 నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

పాలిటెక్నిక్‌ విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్‌ రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్‌ కౌన్సెలింగ్, పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారయ్యాయి.

Updated : 25 May 2024 05:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్‌ రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్‌ కౌన్సెలింగ్, పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారయ్యాయి. శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ప్రవేశ కమిటీల సమావేశాలు జరిగాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆయా సెట్ల కన్వీనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడతల వారీ కౌన్సెలింగ్‌ తేదీలను విడుదల చేశారు. 


ముఖ్యాంశాలు..

ఈసెట్‌..

  • జులై 15 నుంచి 25 వరకు చివరి విడత కౌన్సెలింగ్‌ జరుగుతుంది.
  • జులై 24న స్పాట్‌ ప్రవేశాల మార్గదర్శకాలు జారీ చేస్తారు. జులై 30 నాటికి స్పాట్‌ ప్రవేశాలు పూర్తవుతాయి.

పాలిసెట్‌.. 

  • చివరి విడత కౌన్సెలింగ్‌ జులై 7న మొదలై 16న ముగుస్తుంది.
  • జులై 15 నుంచి పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యా సంవత్సరం మొదలవుతుంది. 15 నుంచి 17 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్‌ తరగతులు, 18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
  • జులై 21 నుంచి 24 వరకు అంతర్గత స్లైడింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో బ్రాంచీలు మారిన వారికీ బోధనా రుసుములు పొందేందుకు అర్హత ఉంటుంది.
  • స్లైడింగ్‌ తర్వాత సీట్లు రద్దు చేసుకుంటే వాటిని స్పాట్‌ ప్రవేశాల్లో చేర్చరు. వాటిని ఆ తర్వాత సంవత్సరం లేటరల్‌ ఎంట్రీ కోసం నిర్వహించే ఎల్‌పీసెట్‌లో ఉత్తీర్ణులైన వారితో భర్తీ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని