Canada: కెనడాలో కాల్పులు.. భారత విద్యార్థి మృతి

భారత్‌కు చెందిన చిరాగ్‌ అంటిల్‌ (24) అనే విద్యార్థి కెనడాలో హత్యకు గురయ్యాడు.

Published : 14 Apr 2024 14:35 IST

(ఫొటో సోర్స్‌: వాంకోవర్‌ పోలీస్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెనడాలో చిరాగ్‌ అంటిల్‌ (24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. విద్యార్థి మృతి విషయాన్ని సౌత్‌ వాంకోవర్‌ పోలీసులు వెల్లడించారు.

‘‘కాల్పుల శబ్దం వినిపించినట్లు ఏప్రిల్‌ 12వ తేదీ రాత్రి 11గంటల సమయంలో ఈస్ట్‌ 55 అవెన్యూ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్లి చూడగా.. కారులో చిరాగ్‌ విగత జీవిగా పడి ఉన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు’ అని వాంకోవర్‌ పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

చిరాగ్‌ హరియాణాకు చెందిన వ్యక్తి. మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు క్రౌడ్‌ఫండింగ్‌ చేస్తున్నట్లు అతడి సోదరుడు రోహిత్‌ అంటిల్‌ స్థానిక మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్‌ యువజన విభాగం అధ్యక్షుడు వరుణ్‌ ఛౌదరీ ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తును క్షుణ్నంగా పర్యవేక్షించాలని విదేశీ వ్యవహారాల శాఖకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని