Nightclub Fire: నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి

స్పెయిన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Updated : 01 Oct 2023 18:56 IST

మాడ్రిడ్‌: స్పెయిన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో (Night Club) భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్నేయ స్పెయిన్‌లోని మర్సియాలో ఈ ప్రమాదం (Fire Accident) జరిగింది. ఆ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు గుర్తించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక బృందాలు కొన్ని గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. చివరకు లోనికి ప్రవేశించిన రెస్క్యూ బృందాలు.. అందులో చిక్కుకుపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

మర్సియాలో నైట్‌ క్లబ్‌లో ఆదివారం ఉదయం 6గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలుసుకొని తక్షణమే అక్కడకు చేరుకున్న రెస్క్యూ బృందాలు.. భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. భారీస్థాయిలో అగ్ని, దట్టమైన పొగ అలుముకోవడంతో రెస్క్యూ సిబ్బందికి లోనికి వెళ్లడం కష్టంగా మారింది. 12 అత్యవసర వాహనాలు, పదుల సంఖ్యలో సిబ్బంది శ్రమించి చివరకు మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం లోనికి ప్రవేశించి గాలించగా పలువురి మృతదేహాలను గుర్తించారు. స్పృహ కోల్పోయిన మరికొందరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని