Rajiv Gandhi Case: రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితులు స్వదేశానికి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులుగా తేలి, జీవిత ఖైదు అనుభవించిన ముగ్గురు వ్యక్తులు బుధవారం ఉదయం తమ స్వదేశానికి వెళ్లారు. 

Updated : 03 Apr 2024 19:16 IST

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హత్య కేసులో నిందితులుగా తేలి, జీవిత ఖైదు అనుభవించిన ముగ్గురు వ్యక్తులు బుధవారం ఉదయం తమ స్వదేశానికి వెళ్లారు. మురుగన్, రాబర్ట్ పయస్, జయకుమార్ సహా మొత్తం ఆరుగురు దోషులను సుప్రీంకోర్టు సూచనల మేరకు 2022 నవంబర్లో విడుదల చేశారు. వీరు జైలులో సత్ర్పవర్తనతో మెలగడంతో శిక్షా కాలాన్ని తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం సైతం సిఫార్సు చేసింది. వీరు శ్రీలంక జాతీయులు కావడంతో జైలు నుంచి విడుదలైన అనంతరం ఓ శరణార్థి శిబిరానికి తరలించారు. ఇటీవల శ్రీలంక ప్రభుత్వం ఈ ముగ్గురికి పాస్‌పోర్ట్‌లు మంజూరుచేయడంతో బుధవారం ఉదయం పోలీసుల బృందం వారిని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. 

నిందితుల్లోని భారతీయ పౌరురాలు నళినిని, మిగిలిన వారిలో ఒకరైన మురుగన్‌ వివాహం చేసుకున్నారు. ఆమెకు మరణశిక్ష విధించినప్పుడు నళిని గర్భిణి అని తేలడంతో సోనియాగాంధీ ఆమె మరణశిక్షను రద్దు చేశారు. ప్రస్తుతం ఆమె కుమార్తె యూఎస్‌లో వైద్యురాలు. నళిని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తోంది. ఆమె భర్త కొలంబో వెళ్లిన అనంతరం అక్కడి నుంచి వీసా తీసుకొని కూతురి వద్దకు వెళ్లాలనుకుంటున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని