USA: కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు.. ముగ్గురి మృతి!
కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్ నగరంలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా..మరో నలుగురికి గాయాలయ్యాయి.
లాస్ ఏంజిల్స్: అమెరికా (USA)లో కాల్పుల ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కాలిఫోర్నియా (California)లోని లాస్ ఏంజిల్స్ (Los Angeles) నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. లాస్ ఏంజిల్స్‌కు అతి సమీపంలోని బెవర్లీ క్రెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జనసమూహంలో కలిసిపోయిన దుండగుడు హఠాత్తుగా కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాలిఫోర్నియాలో ఈ నెలలో కాల్పులు జరగడం ఇది నాలుగో సారి.
ఇటీవల లాస్‌ఏంజిల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. చైనీయుల లూనార్ నూతన సంవత్సర వేడుకలపైకి దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 10 మందిని పొట్టనపెట్టుకున్నాడు. ఆ తర్వాత హాఫ్‌మూన్ బే ప్రాంతంలో రెండుచోట్ల దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. మరోవైపు షికాగోలో తెలుగు విద్యార్థులపై నల్ల జాతీయులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన నందపు దేవ్‌శిష్ అనే విద్యార్థి మృతిచెందగా, కొప్పాల సాయి చరణ్ అనే యువకుడు గాయాలపాలయ్యారు. విశాఖపట్నానికి చెందిన లక్ష్మణ్ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Sajjala: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఎవరో గుర్తించాం : సజ్జల
-
Ap-top-news News
Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
-
Politics News
Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు
-
Ap-top-news News
Justice Battu Devanand : జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ
-
Politics News
Ganta Srinivasa Rao: ఫైనల్స్‌లో వైకాపా ఉండదు