DNA: గాలిలోని డీఎన్‌ఏతో నేరగాళ్లను కనిపెట్టొచ్చు!

నేరం చేసిన చోట తమ వేలిముద్రలు పడకుండా, ఇతరత్రా ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడే జాదూగాళ్లను కూడా పక్కాగా కనిపెట్టేందుకు ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు సరికొత్త విధానాన్ని గుర్తించారు.

Updated : 04 Apr 2024 07:04 IST

దిల్లీ: నేరం చేసిన చోట తమ వేలిముద్రలు పడకుండా, ఇతరత్రా ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడే జాదూగాళ్లను కూడా పక్కాగా కనిపెట్టేందుకు ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు సరికొత్త విధానాన్ని గుర్తించారు. ఇందులో నేర ప్రదేశంలో గాలిలో నుంచి మానవ డీఎన్‌ఏను సేకరించి విశ్లేషిస్తారు. మనుషులు మాట్లాడినప్పుడు, శ్వాసించినప్పుడు కూడా వారి డీఎన్‌ఏ ఆనవాళ్లు వాతావరణంలోకి విడుదలవుతుంటాయని పరిశోధకులు తెలిపారు. వాటిని అక్కడి వాతావరణం నుంచి సేకరించొచ్చని పేర్కొన్నారు. ఏదైనా గదిలో ఎయిర్‌ కండిషనింగ్‌ యూనిట్ల ద్వారా వాయు ప్రసరణ జరుగుతున్నప్పుడు.. డీఎన్‌యే ఆనవాళ్లు అక్కడి ఘన, ద్రవ ఉపరితలాలపై స్థిరపడుతుంటాయని, గాలిలోనూ తిరుగుతుంటాయని వివరించారు. ఈ తరహా పర్యావరణ డీఎన్‌ఏ (ఈడీఎన్‌ఏ)ను సేకరించి విశ్లేషిస్తే నేరగాళ్లను గుర్తించడం సులువవుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని