Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వీళ్లకు బాగా కలిసొచ్చింది!

రష్యా-ఉక్రెయిన్‌ (Russia-Ukraine) ప్రభావం వల్ల చమురు (oil), సహజవాయు ధరల్లో పెరుగుదల కొన్ని సంస్థల సీఈవోలకు బాగా కలిసొచ్చింది. అధికమొత్తంలో లాభాలు రావడంతో యాజమాన్యాలు వాళ్ల జీతాలను భారీగా పెంచేశాయి.

Published : 15 Apr 2023 02:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌-రష్యా (Ukraine-Russia) యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రపంచ దేశాలపై కనిపిస్తోంది. యుద్ధ ప్రారంభమైన తర్వాత ముడి చమురు (oil), సహజవాయువు (Natural Gas) ధరలు అమాంతం పెరిగిపోయాయి. చమురు సంస్థలు (Oil Companies) భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో యాజమాన్యాలు సంస్థ సీఈవోల జీతాలను గతంలో ఎన్నడూ లేనంతగా పెంచాయి. అమెరికాకు చెందిన ఎక్సాన్‌ మొబిల్ చమురు సంస్థ తన సీఈవో జీతాన్ని ఒక్కసారిగా 52 శాతం మేర పెంచినట్లు ది గార్డియన్‌ పత్రిక తెలిపింది. గతేడాది ఎక్సోమొబిల్ సంస్థ గంటకు దాదాపు 6.3 మిలియన్‌ డాలర్ల లాభాలను గడించించినట్లు పేర్కొంది. అయితే, అన్ని చమురు సంస్థలు తమ ఉద్యోగుల జీతాలను ఇంత మొత్తంలో పెంచలేదు. నిజానికి చమురు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల వార్షిక వేతనాలు గతేడాదితో పోల్చితే తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్సాన్‌ మొబిల్‌ సంస్థలో సగటు ఉద్యోగి వార్షిక వేతనం 9శాతం మేర పడిపోగా.. చెవ్రాన్‌ సంస్థ ఉద్యోగుల వార్షిక వేతనాలు 12శాతం మేర తగ్గాయి.

ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికాలోని ప్రముఖ చమురు సంస్థలు 2022లో రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించాయి. ఆయిల్‌, సహజవాయువు ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం, ఉద్యోగుల సంఖ్యను కూడా పరిమితం చేయడం కూడా దీనికి కారణమై ఉండొచ్చు. అమెరికాలోని చమురు సంస్థల సీఈవోలలో ఎక్సాన్‌ సీఈవో జీతంలోనే పెరుగుదలే అధికం. ఆ తర్వాత స్థానంలో చెవ్రాన్‌ సంస్థ సీఈవో మిచెల్‌ విర్త్‌ 4 శాతం అధిక వేతనం పొందారు. ఆకీడెంటల్‌ పెట్రోలియం సీఈవో విక్కీ హొల్యూబ్స్‌ 35శాతం పెరుగుదల సాధించినప్పటికీ.. చెవ్రాన్‌ సీఈవో జీతంతో పోల్చుకుంటే తక్కువ. మరోవైపు గత ఏడాది కంటే కోనొకో ఫిలిప్స్‌ సీఈవో రెయాన్‌ లాన్సే వార్షిక వేతనంలో 16శాతం కోతపడింది.ఆయా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆకీడెంటల్‌ ఉద్యోగుల వార్షిక వేతనం 19శాతం పెరగ్గా.. కోనొకో ఉద్యోగుల వేతనం 1 శాతం మేర తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని