Airport: విమానాశ్రయంలో లగేజీ గుర్తించడానికి రిబ్బన్లు కడుతున్నారా.. ఇది మీ కోసమే..

విదేశాల్లోని పిల్లలను చూసేందుకు వెళ్లే తల్లిదండ్రులు వారి పిల్లల కోసం రకరకాల ఆహార పదార్థాలు, సామాన్లు తీసుకెళ్తుంటారు. ఆ సమయంలో విమానాశ్రయంలో బ్యాగేజ్ కన్వేయర్ బెల్ట్‌ వద్ద త్వరగా వారి సామాన్లు గుర్తించడానికి వీలుగా బ్యాగులకు రంగురంగుల రిబ్బన్లు కడుతుంటారు. అలా చేయడం సరైనది కాదని, వాటివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విమానాశ్రయ సిబ్బంది చెబుతున్నారు.

Published : 08 Jun 2024 00:03 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: విమానాశ్రయాల్లో కన్వేయర్‌ బెల్టుపై ఉన్న తమ లగేజీని త్వరగా గుర్తించేందుకుగానూ కొంతమంది ప్రయాణికులు వాటికి రిబ్బన్లు(ribbons) వంటివి కడుతుంటారు. అలా చేయడం సరికాదని, వాటివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విమానాశ్రయ సిబ్బంది చెబుతున్నారు. లగేజీ విషయంలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఐర్లాండ్‌లోని డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహించే సూట్‌కేస్‌ హ్యాండ్లర్(baggage handler)  జాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘‘విమానాశ్రయంలో బ్యాగేజ్ కన్వేయర్ బెల్ట్‌(baggage conveyor belt)పై ఉండే తమ వస్తువులను తేలికగా గుర్తించడం కోసం కొందరు సూట్‌కేస్‌లకు రిబ్బన్లు కడుతుంటారు. అయితే.. దీంతో స్కానింగ్‌ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఫలితంగా ప్రయాణికులు వారి విమానాలను సకాలంలో అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. స్కానింగ్ (scanning) ప్రక్రియకు ఆటంకం కలిగించే లగేజీ ట్యాగ్‌లు, రిబ్బన్‌ల వంటి వాటిని సూట్‌కేస్‌లకు అతికించవద్దు. అలాగే వాటికి ఉన్న మునుపటి ట్రావెల్ స్టిక్కర్‌లను తొలగించాలి. అదేవిధంగా బాదం పొడి, చక్కెరతో తయారుచేసిన మర్జీపాన్‌ వంటి తీపి పదార్థాలను తీసుకురాకపోవడమే మంచింది. స్కానింగ్‌ ప్రక్రియ వాటిని పేలుడు పదార్థాల మాదిరి భ్రమించే అవకాశం ఉంటుంది. వస్తువులను కన్వేయర్ బెల్ట్‌పై నుంచి కిందకు తీసే సమయంలో అవి కింద పడకుండా, పగిలిపోకుండా ఉండడం కోసం ప్రయాణికులు తమ బ్యాగ్‌లకు ఉన్న వీల్స్‌ పైవైపు ఉండేలా బెల్ట్‌పై పెట్టాలి. దానివల్ల లగేజీ కిందకు దింపే సమయంలో సులభంగా తీసుకోవచ్చు’’ అని ఆయన తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు