USA: అమెరికాలో వంతెనను ఢీకొన్న బార్జ్‌..!

అమెరికాలో మరో వంతెనకు భారీ ప్రమాదం తప్పింది. బాల్టిమోర్‌ ఘటన మరువక ముందే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. 

Published : 31 Mar 2024 10:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA)లో బాల్టిమోర్‌ వంతెన ప్రమాదాన్ని ప్రజలు మర్చిపోక ముందే మరో ఘటన చోటు చేసుకొంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఓక్లహోమా(Oklahoma)లోని ఆర్కన్సాస్‌ నదిపై వంతెనను బార్జ్‌ (భారీ వాహనాలను తరలించే పంటు వంటిది) ఢీకొంది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన స్థానిక పెట్రోలింగ్‌ బృందాలు సాల్లిసా హైవే దక్షిణ భాగాన్ని మూసివేశాయి. వాహనాలను వేరే దారిలోకి మళ్లించారు. ఈ ఘటనలో బార్జ్‌ దెబ్బతింది. వంతెన పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ఇటీవల అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయి పలువురు చనిపోయారు. ఈ ఘటనలో నౌకలోని సిబ్బంది మొత్తం భారతీయులే. ఘటనకు ముందు నౌక విద్యుత్తు సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అధికారులను హెచ్చరించి పలువురి ప్రాణాలను కాపాడిన నౌక సిబ్బందిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని