Joe Biden: తోటివారంతా ఆడి పాడుతుంటే.. తదేకంగా నిలబడిపోయిన బైడెన్‌!

వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఆడుతూ పాడుతుండగా.. అధ్యక్షుడు బైడెన్‌ మాత్రం కొన్ని సెకన్ల పాటు తదేకంగా నిలబడటం మరోసారి చర్చనీయాంశమైంది.

Published : 12 Jun 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పలు సందర్భాల్లో వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. మాటల్లో తడబాటు, అసంకల్పిత చర్యలతో తోటివారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్న సందర్భాలు ఇటీవల పెరుగుతున్నాయి. తాజాగా వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఆడుతూ పాడుతుండగా.. బైడెన్‌ మాత్రం కొన్ని సెకన్ల పాటు తదేకంగా నిలబడటం మరోసారి చర్చకు దారితీసింది.

అమెరికాలో బానిసత్వం ముగింపు జ్ఞాపకార్థంగా జూన్‌ 19న జూన్‌టీన్త్‌ హాలీడేని చేసుకుంటారు. ఇందులో భాగంగా వైట్‌హౌస్‌లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఇందులో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తోపాటు తోటివారంతా మ్యూజిక్‌కు అనుగుణంగా నృత్యాలు చేశారు. ఆ సమయంలో అధ్యక్షుడు జో బైడెన్‌ మాత్రం తదేకంగా దాదాపు 20సెకన్ల పాటు నిలబడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు