COVID19: కొవిడ్ మూలాలు బహిర్గతం చేసే బిల్లుపై బైడెన్ సంతకం
వుహాన్‌లో కొవిడ్ పుట్టుకపై అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు త్వరలో సమాచారం బహిర్గతం చేయనున్నాయి. ఈమేరకు బైడెన్ ఓ బిల్లుపై సంతకం చేశారు.
ఇంటర్నెట్‌డెస్క్: కొవిడ్(Covid 19) మూలాలకు సంబంధించి వుహాన్ ల్యాబ్‌పై సేకరించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని బహిర్గతం చేసే బైపార్టేషన్ (ఇరు పార్టీలు అంగీకరించిన) బిల్లుపై నేడు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేశారు. దీంతో కొవిడ్ మూలాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించిన రహస్య సమాచారం బయటపెట్టేందుకు అవకాశం లభించింది. ఇప్పటికే ఈ బిల్లును అమెరికా కాంగ్రెస్‌లోని సెనెట్, రిపబ్లికన్లు ఆమోదించారు. చైనాలోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీపై సేకరించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఈ బిల్లు సూచిస్తోంది. అక్కడ జరిగిన పరిశోధనలతో కొవిడ్ వ్యాప్తికి ఉన్న సంబంధాలను ఈ ఇంటెలిజెన్స్ వెల్లడించే అవకాశం ఉంది. కాకపోతే వీటి వివరాలను వెల్లడించే క్రమంలో సున్నితమైన సోర్సులను, ఇంటెలిజెన్స్ సంస్థ అనుసరించిన పద్దతులను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కొవిడ్ మూలాలపై భిన్నాభిప్రాయలను వెల్లడిస్తున్నాయి. చాలా సంస్థలు ల్యాబ్ నుంచి లీకైనట్లు చెబుతుంటే.. మరికొన్ని మాత్రం జంతువుల నుంచి పాకినట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అమెరికాలో కొవిడ్ కారణంగా 11 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తాజా బిల్లుపై బైడెన్ సంతకం చేస్తూ.. ‘‘కొవిడ్ మూలాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని మా ఇంటెలిజెన్స్ సంస్థలు సమీక్షిస్తాయి. వీటిల్లో వుహాన్ ల్యాబ్‌కు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ బిల్లును అనుసరించి మా కార్యవర్గం వీలైనంత ఎక్కువ సమాచారాన్ని బహిర్గతం చేస్తుంది. జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారే సమాచారం మాత్రమే మా ప్రభుత్వం రహస్యంగా ఉంచుతుంది’’ అని పేర్కొన్నారు.
కరోనా(Covid 19) వైరస్ జన్మస్థానం చైనా(china)లో ఓ ల్యాబ్ నుంచే జరిగిందని అమెరికా(USA)కు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ఓ నివేదికలో పేర్కొంది. గతంలో అమెరికాకు చెందిన వివిధ డిపార్ట్‌మెంట్లు కొవిడ్ పుట్టుకపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఎనర్జీ డిపార్ట్‌మెంట్ కూడా గతంలో నిర్దిష్టంగా చెప్పలేకపోయింది. కానీ, తాజాగా ఇచ్చిన 5 పేజీల నివేదికతో ఎనర్జీ డిపార్ట్‌మెంట్ కూడా చైనా వైపే వేలెత్తి చూపింది. తన నెట్‌వర్క్‌లోని ల్యాబ్‌ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా దీనిని తయారు చేసింది. గతంలో అమెరికా దర్యప్తు సంస్థ ఎఫ్‌బీఐ కూడా చైనాలోని ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు వైరస్ లీకై ఉంటుందని అభిప్రాయపడింది. మరోవైపు అమెరికా కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లు కొవిడ్ పుట్టుకపై మరింత సమాచారం తెప్పించేందుకు బైడెన్ కార్యవర్గం మరిన్ని వనరులను మోహరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
పోరాటం కొనసాగిస్తాం.. రైల్వే ఉద్యోగాల్లో చేరిన రెజ్లర్లు
-
Ts-top-news News
19 నుంచి రాష్ట్రమంతా హరితోత్సవం
-
World News
Heart Attacks: తీవ్ర గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువ..? తాజా అధ్యయనం ఏమందంటే..!
-
India News
Odisha Train Accident: మృతులు, బాధితులను గుర్తించేందుకు సహకరించండి.. రైల్వేశాఖ విజ్ఞప్తి
-
Sports News
Virat Kohli: కష్టకాలంలో విరాట్‌కు అదృష్టం కలిసి రాలేదు.. : గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Crime News
Toll Gate: గేటు తీయడం ఆలస్యమైందని.. టోల్ ఉద్యోగి హత్య