Biden-Trump: ‘ఆ బ్లీచ్‌ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్‌పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్‌ (Biden), డొనాల్డ్ ట్రంప్‌ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. 

Published : 25 Apr 2024 14:30 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడీవేడీగా కొనసాగుతోంది. అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా సంకోచించడంలేదు. తాజాగా ట్రంప్‌ జట్టును ఉద్దేశించి బైడెన్ వ్యంగ్యంగా మాట్లాడారు.

‘‘కరోనాతో పోరాడుతోన్న సమయంలో శరీరంలోకి బ్లీచ్‌ ఎక్కించుకోమని ట్రంప్‌ మీకు సలహా ఇచ్చేవారు. అయితే, అది కాస్తా మిస్‌ అయ్యి ఆయన జుట్టుకే చేరింది’’ అంటూ ఎద్దేవా చేశారు. కొద్దిరోజుల క్రితం కూడా బైడెన్‌ ఇదే విషయంపై మాట్లాడారు. ‘‘మీరు బ్లీచ్ తీసుకోకండి. అలా తీసుకోమని చెప్పే వ్యక్తికి ఓటు వేయకండి’’ అని కోరారు. మరోపక్క ‘స్లీపీ జో’ అంటూ అధ్యక్షుడిని ట్రంప్‌ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కరోనాను ఎదుర్కోవడానికి క్రిమిసంహారక ఇంజెక్షన్ తీసుకోవాలని, అది ఊపిరితిత్తుల్ని శుభ్రం చేస్తుందని అప్పట్లో ట్రంప్‌ తరచూ వ్యాఖ్యలు చేశారు. అలాగే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను గేమ్ ఛేంజర్‌ ఆయన అని చెప్పారు. నిరూపితం కానీ చికిత్సలను ప్రచారం చేశారు. అయితే, వీటికి వ్యతిరేకంగా వైద్యనిపుణులు తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని