Boeing flight: టేకాఫ్‌ సమయంలో ఊడిన బోయింగ్‌ విమానం టైరు

టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 

Published : 24 Apr 2024 17:47 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని ఓఆర్‌ టాంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం చోటుచేసుకుంది. దీంతో బోయింగ్‌పై మరోసారి విమర్శలు తలెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ నెటిజన్ షేర్‌ చేసిన వీడియోలో విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే రన్‌వేపై ల్యాండ్ అయిన విమానం టైరు నుంచి పొగ రావడం కనిపించింది. కుడి వైపు వింగ్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు వీడియోలో రికార్డ్‌ అయ్యింది.

"ఫ్లైట్ టేకాఫ్‌ సమయంలో చక్రం దెబ్బతిన్నా అది సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు" అని దక్షిణాఫ్రికా విమానయాన సంస్థ తెలిపింది. ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ సిబ్బంది ఈ విషయాన్ని  గమనించి అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు.  ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరుకొనేందుకు వారికోసం మరో విమానాన్ని ఏర్పాటుచేశామన్నారు.

కాగా, గత కొంతకాలంగా బోయింగ్‌ విమానాల పని తీరుపైనా, వాటిలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలపైనా కంపెనీ పలు కేసులను ఎదుర్కొంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని