Pakistan-Afghanistan: అఫ్గాన్‌లో డ్రోన్ దాడుల వెనక విదేశీ శక్తి.. అంగీకరించిన పాక్..!

ఇంటర్నెట్‌డెస్క్: సరిహద్దు వెంబడి ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ (Pakistan-Afghanistan) మధ్య కొనసాగుతోన్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ తరుణంలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అఫ్గాన్‌పై డ్రోన్ దాడుల వెనక విదేశీ శక్తి ఉందని పాక్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దానితో ఉన్న ఒప్పందం కారణంగా ఆ దాడులు ఆపలేమని నిస్సహాయత వ్యక్తంచేసిందని సమాచారం. ఈ మేరకు అఫ్గాన్ మీడియాను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.
పాక్ నుంచి అఫ్గాన్ డ్రోన్ దాడులు నిర్వహించేందుకు అనుమతించేలా ఆ దేశం (Third country)తో ఒప్పందం ఉందని, దానికి తాము కట్టుబడి ఉన్నామని పాక్ (Pakistan) చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. ఆ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించడం సాధ్యంకాదు కాబట్టి ఆ దాడుల్ని నిరోధించలేమని అంగీకరించిందని వెల్లడించింది. అయితే ఆ విదేశం పేరు మాత్రం పాక్ బయటపెట్టలేదని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఇటీవల పాక్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రెండువారాల క్రితం అఫ్గాన్ రాజధాని కాబుల్‌లో సంభవించిన పేలుళ్లతో అవి తీవ్ర రూపం దాల్చాయి. పాకిస్థానీ తాలిబన్ ఫైటర్ల(TTP)కు ఆశ్రయం కల్పించేవారిపై తీవ్ర చర్యలు ఉంటాయని పాక్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా అది నామమాత్రమే. పాక్-అఫ్గాన్ మధ్య దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం వీరి మధ్య తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో రెండోదశ చర్చలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అవి ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఈ తరుణంలో పాక్ రహస్య ఒప్పందం గురించి బయటకు వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

పాక్ అణ్వాయుధాలను పరీక్షిస్తోంది: బాంబు పేల్చిన ట్రంప్
Donald Trump: చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తోన్న దేశాల జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని ట్రంప్ అన్నారు. - 
                                    
                                        
చైనాతో మొన్న డీల్.. నేడు వార్నింగ్: ట్రంప్ హెచ్చరికలు దేనికంటే..?
Trump-Jinping: చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. - 
                                    
                                        

రూ.895 కోట్ల నగల చోరీ.. చిల్లర దొంగల పనే..!
Paris Museum Heist: మ్యూజియంలో భారీ చోరీకి పాల్పడింది చిల్లర దొంగలేనని తెలుస్తోంది. - 
                                    
                                        

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..6.3 తీవ్రతగా నమోదు
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. - 
                                    
                                        

సూపర్ మార్కెట్లో భారీ పేలుడు.. 23 మంది మృతి
మెక్సికోలోని ఓ సూపర్మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. - 
                                    
                                        

‘డూమ్స్‌డే క్షిపణి’తో రష్యా సరికొత్త అణు జలాంతర్గామి!
అణుశక్తితో నడిచే పొసైడన్ అణు డ్రోన్‌తో కూడిన కొత్త అణు జలాంతర్గామిని రష్యా ప్రారంభించింది. ‘డూమ్స్‌డే క్షిపణి’గా కూడా ముద్రపడిన ఈ డ్రోన్.. సాగరంలో సుదూర ప్రాంతాలు చేరి, తీవ్ర వినాశనం సృష్టించగలదు. - 
                                    
                                        

రైలు బోగీ మొత్తం రక్తసిక్తం
బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌షైర్‌లో శనివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. లండన్‌లోని డాన్‌కస్టర్ నుంచి కింగ్స్ క్రాస్‌కు వెళ్తున్న రైలులో దుండగులు కత్తులతో వీరంగం సృష్టించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్‌రెడ్డి
 - 
                        
                            

ఉద్యోగాల పేరిట రూ.5 కోట్లు వసూలు.. విడదల రజని అనుచరులపై ఫిర్యాదు
 - 
                        
                            

ఐదు కిలోమీటర్ల మేర ట్రక్కు బీభత్సం..10మంది మృతి
 - 
                        
                            

భారత పుత్రికలు చరిత్ర సృష్టించారు: ప్రధాని మోదీ
 - 
                        
                            

కార్తిక మాసం రద్దీ.. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతపై పవన్ కీలక ఆదేశాలు
 - 
                        
                            

పబ్లిక్‌లో వాళ్ల పేరు చెబితే నన్ను చంపేస్తారు: రష్మిక
 


